రామచంద్రపురంలో ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో యువకుడు మృతి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిర్గాపూర్ మండలం సుర్త్యా నాయక్ తాండకు చెందిన జైపాల్ (28) కుటుంబ సభ్యులతో ఆర్సీపురంలో ఉంటున్నారు. అయితే స్థానిక వినాయక మండపంలో శనివారం రాత్రి డాన్స్ చేసి నీరసించిపోయి ఇంటికి వచ్చి పడుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.