రెండు క్లినిక్ లను సీజ్ చేసిన జిల్లా వైద్యాధికారి

79చూసినవారు
రెండు క్లినిక్ లను సీజ్ చేసిన జిల్లా వైద్యాధికారి
పటాన్ చెరులో అనుమతి లేకుండా నడుస్తున్న ఇందిరా, పద్మావతి క్లినిక్ లను జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి గురువారం సీజ్ చేశారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని అనుమతి తీసుకోవాలని ఆసుపత్రి నిర్వహణకు సూచించారు. గణేష్ డయాగ్నస్టిక్ లో ధరల పట్టిక ఎక్కువగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు తగ్గించాలని వారికి సూచించారు.

సంబంధిత పోస్ట్