పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులోని రెండు గేట్లను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం తెరిచారు. ఆయన మాట్లాడుతూ 4, 5 గేట్ల ద్వారా 16, 284 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేసినట్లు చెప్పారు. సింగూరు ప్రాజెక్టు నిండడంతో రైతులకు పంటలకు ఎలాంటి డోకా లేదని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు.