సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం ఖాదీరాబాద్ లో మంగళవారం అర్థరాత్రి గౌరమ్మ (45) తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది విగత జీవిగా పడి ఉంది. గౌరమ్మ హత్యా అనంతరం ఇంటి పరిసరాల్లో తమ ఆనవాళ్లు తెలియకుండా కారం పొడి చల్లి పరారైనట్లు సమాచారం. మృతురాలి కొడుకు ఫిర్యాదు మేరకు ఘటనస్థలికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళా మృతికి గల కారణాలపై జిల్లా ఎస్పీ పంకజ్ పరితోష్ ఘటనస్థలిని పరిశీలించి ఆరా తీశారు.