అక్బర్ పేట భూంపల్లి మండలం తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. తాహసిల్దార్ మల్లికార్జున్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ రూపశిల్పి సామాజిక న్యాయం అందరికీ సమాన హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడిన నాయకుడు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ శోభ, సిబ్బంది సంతోష్ తదితరులు పాల్గొన్నారు.