అంగరంగ వైభవంగా బండ మల్లన్నకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలను ఆదివారం సమర్పించారు. అక్బరుపేట భూంపల్లి మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి, జంగాపల్లి గ్రామ శివారులో గల బండ మల్లన్నకు అన్వాయితీ ప్రకారం ప్రతి ఏటా జనవరి మాసంలో మల్లికార్జున స్వామికి ఇరు గ్రామాల ప్రజలు అంగరంగ వైభవంతో బోనాలను సమర్పించుకొని తమ మొక్కులను చెల్లించుకుంటారు.