మిరుదొడ్డి మండలంలోని ధర్మారం గ్రామంలో మంగళవారం ఉదయం గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అంజాగౌడ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. కుటుంబ యజమాని మృతి చెందడంతో కుటుంబీకులు అనాథలుగా మారారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. అనంతరం ఆటో కార్మికులు సంతాపం వ్యక్తం చేశారు.