బహుజనుల అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, గొప్ప వ్యక్తి డా. బాబా సాహెబ్ అంబేద్కర్ అని దుబ్బాక ఏఎంసీ చైర్మన్ చింతల జ్యోతి కృష్ణ , అక్బర్ పేట భూంపల్లి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కాకి కొండల్ లు కొనియాడారు. సోమవారం అక్బర్ పేట భూంపల్లి మండలంలోని పోతరెడ్డి పేట గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.