దుబ్బాక మండలం పెద్దచీకోడు గ్రామ మాజీ సర్పంచ్ తౌడ శ్రీనివాస్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మంగళవారం గ్రామంలోని ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. తల్లి మరణంతో కుంగిపోద్దని ఆయనకు ధైర్యాన్ని ఇచ్చారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానాల శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.