రెడ్డి కులస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు దేవుడి నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో శివాజీ చౌరస్తాలో ఫ్లెక్సీని దహనం చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి, మండల అధ్యక్షుడు కిష్టారెడ్డి, నాయకులు ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.