బహుజనుల అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, గొప్ప వ్యక్తి డా. బాబా సాహెబ్ అంబేద్కర్ అని లచ్చపేట మాజీ ఉప సర్పంచ్, దళిత సంఘం నాయకులు ఆస రవి కొనియాడారు. సోమవారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రపంచంలో 64 మాస్టర్స్ పట్టాలు పొందిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. అణగారిన వర్గాలకు విద్య, అంటరాని వారికి సమాన హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి అన్నారు.