తీన్మార్ మల్లన్న పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలానికి చెందిన కడతల అరవింద్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ ను అడ్వకేట్ పల్లి వినోద్ కుమార్ రెడ్డితో కలిసి దాఖలు చేసినట్లు పిటిషనర్ అరవింద్ రెడ్డి తెలిపారు.