బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్. రామచందర్ రావు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, దుబ్బాకకు చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి బాలేష్ గౌడ్ శనివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన రామచందర్ రావుకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంగోని సురేష్ గౌడ్ సహా ఇతర నేతలు కూడా అధ్యక్షుడిని కలిశారు.