
కిడ్నాప్ వార్త అవాస్తవం: వైసీపీ ఎమ్మెల్సీ
AP: టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారన్న వార్తను వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఖండించారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగా ఇంట్లోనే ఉన్నానని స్పష్టం చేశారు. కిడ్నాప్ చేశారంటూ వదంతులు సృష్టించవద్దని ఆయన కోరారు. కాగా, తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు తమ పార్టీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపించిన విషయం తెలిసిందే.