

VIDEO: హెలికాప్టర్ ప్రమాద దృశ్యాలు
ఉత్తరాఖండ్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. కేదార్నాథ్కు సమీపంలోని గౌరీకుండ్ అడవుల్లో హెలికాప్టర్ కూలి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఘటనకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా, ఇటీవల అహ్మదాబాద్లో విమానం కూలిన ఘటనలో 274 మంది మృతి చెందిన విషాదం మరవక ముందే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.