సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొంగరి రవి అన్నారు. సోమవారం దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు దుబ్బాక మండలంలోని పెద్ద గుండవెల్లి గ్రామానికి చెందిన బిట్ల శివ కి రూ. 60 వేలు, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఆ రంగనబోయిన సంతోష్ కి రూ 42,500/- సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మండల ఉపాధ్యక్షుడు కడుదూరి నరేందర్ రెడ్డి తో కలిసి అందజేశారు.