సీఎంఆర్ఎఫ్ చెక్కులు నిరుపేద కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని దుబ్బాక మండల అధ్యక్షులు కొంగరి రవి అన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామనికి చెందిన వతం రాజుకు రూ. 19,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఉపాధ్యక్షులు కడుదురి నరేందర్ రెడ్డి, మండల జనరల్ సెక్రటరీ చర్లపల్లి బాల్ రెడ్డిలతో కలిసి అందజేశారు.