జవాన్ రామస్వామి వీడియో చూసిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఆయనకు జరిగినటువంటి అన్యాయం చాలా దుర్మార్గమని అప్పటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థ ఉన్నప్పుడు ఇలాంటి అక్రమాలు ఎన్నో జరిగాయని ఆయన వాపోయారు. వెంటనే స్థానిక రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి జవాన్ రామస్వామికి జరిగిన అన్యాయంపై పూర్తిగా ఆయనకు నివేదికను అందిస్తానని న్యాయం జరిగేలా చర్యలు తీసుకోమని వారిని వేడుకుంటానని జవాన్ రామస్వామి కుటుంబానికి అండగా ఉంటామని ఆయన అన్నారు.