పేద ప్రజల ఆకలి గోస తీర్చేందుకు సన్నబియ్యం పంపిణీ చేపడుతుందని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని బేగంపేట గ్రామ వాస్తవ్యులైన రైతు బాల్ రాజయ్య కుటుంబానికి వచ్చిన సన్న బియ్యంతో లబ్ధిదారుని నివాసంలో 150 మందితో కలిసి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.