దుబ్బాక: విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరణ చేయాలి
విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరిస్తామని తెలంగాణ ఉద్యమం సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని టీవీఎస్ సి జేఏసి జిల్లా సంయుక్త కార్యదర్శి రవి కుమార్ గౌడ్ అన్నారు. దుబ్బాకలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల పాదయాత్రలో మేము ప్రభుత్వంలోకి రాగానే పూర్తిస్థాయిలో క్రమబద్ధీకరణ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరణ చేయాలని కోరారు.