సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలంలోని పోతారెడ్డి పేట గ్రామంలో రెవెన్యూ సదస్సును మండల తహశీల్దార్ మల్లికార్జున్ రెడ్డి, రెవెన్యూ సిబ్బందితో కలిసి బుధవారం రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్ లు హాజరై మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన భూభారతి చట్టంతో రైతుల సమస్యలు తీరుతాయని తెలిపారు.