అక్బర్ పేట భూంపల్లి మండలంలోని భూంపల్లి, బేగంపేట, మోతె, మిరుదొడ్డి మండలంలో చెప్యాల, మిరుదొడ్డి, కాసులభద్ పలు గ్రామాలలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలలొ ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.