దుబ్బాక మండలం శిలాజి నగర్ గ్రామానికి చెందిన పెంబర్తి రాకేష్ (23) కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ రాకేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి, శనివారం ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు దేవేందర్, బూత్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్, సీనియర్ నాయకులు కొత్త దేవి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.