
పెళ్లికి ముందే జాగ్రత్త పడండి!
కొత్తగా పెళ్లయిన జంటలు హనీమూన్కు వెళ్లాలంటే జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటివరకూ భర్తతో సంతోషంగా ఉన్నట్లు నటించి, సుపారీ ఇచ్చి చంపించిన భార్య సోనమ్ కేసు కొత్త జంటల్లో భయాన్ని నెలకొల్పింది. ప్రస్తుత సమాజంలో ఇలాంటి కేసులెన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి చేసే ముందే పిల్లల ఇష్టాలను పేరెంట్స్ తెలుసుకోవడం మంచిదని నెటిజన్లు సూచిస్తున్నారు. అసలు హనీమూన్కు పంపడం అవసరమా? అని మధ్యప్రదేశ్ ఎంపీ మోహన్ యాదవ్ సూచించారు.