దుబ్బాక మండలం రాజక్కపేటకు చెందిన బోయ మోహన్(48) రేకులకుంట ఆలయంలో ఎలక్ట్రీషియన్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆలయ సమీపంలోని అడవిలో గురువారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.