చేపల చెరువు అనుమతి పత్రాన్ని అందజేసిన దుబ్బాక ఎమ్మెల్యే

67చూసినవారు
చేపల చెరువు అనుమతి పత్రాన్ని అందజేసిన దుబ్బాక ఎమ్మెల్యే
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలంలోని ఖాజీపూర్ గ్రామంలోని గ్రామ చేపల చెరువు సంబంధించిన పూర్తి హక్కు ముదిరాజులకే చెందుతుందని ఖాజీపూర్ సొసైటీ చైర్మన్ పెండల రమేష్ ముదిరాజ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజున అక్బరుపేట భూంపల్లి మండలంలోని నగరం గ్రామం అంబేద్కర్ విగ్రహం వద్ద దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చేతుల మీదుగా చేపలు పట్టే అనుమతి పత్రాన్ని తీసుకోవడం సంతోషకరంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్