
తైవాన్లో 5.9 తీవ్రతతో భూకంపం
తైవాన్లో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. హువాలియెన్ నగరానికి 71 కి.మీ. దూరంలో భూ ఉపరితలానికి 31.1 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. భూకంపం ధాటికి తైవాన్ రాజధాని తైపీలో భవనాలు కంపించాయి. కాగా, ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.