అక్బరుపేట భూంపల్లి మండలం కేంద్రంలోని చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు రోడ్డు మార్గమధ్యలో ఎక్కడ కూడా డివైడర్ల యూటర్న్ ని ఏర్పరచకపోవడం వలన వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏదైనా అవసరాల నిమిత్తం కోసం షాపులన్నీ డివైడర్ కు అటుపక్కన, ఇటుపక్కన ఉండడంతో కొందరు వాహనదారులు వారి అత్యవసరాలు నిమిత్తం రాంగ్ రూట్లలొ వెళ్లడంతో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని వాహనాదారులు వాపోతున్నారు. తక్షణమే సంబంధిత రోడ్డు కాంట్రాక్టర్లు స్పందించి యూటర్న్ ని ఏర్పరచాలని వాహనాదారులు, ప్రజలు కోరుతున్నారు.