100 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం దుబ్బాక మున్సిపల్ కమిషనర్ కే. రమేష్ కుమార్ మాట్లాడుతూ డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు విస్తరించకుండా ఉండేందుకు పలు వార్డులలో దోమల నివారణ చర్యలు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కార్యాలయ సిబ్బంది, ఆర్పీలు, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.