దుబ్బాకలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దిష్టిబొమ్మలను గురువారం దగ్ధం చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మున్సిపల్ ఛైర్ పర్సన్ వనిత భూమిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఎం, డీప్యూటీ సీఎంలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.