మొక్కజొన్నలో రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య కత్తెర పురుగు అని, నివారణ కొరకు పురుగుల మందులు పిచికారి చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని సిద్దిపేట జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున సూచించారు. పెద్ద మాసాన్ పల్లి గ్రామ రైతు కుక్కునూరు పల్లి రమేష్ మొక్కజొన్న సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోతాదుకు మించి మందులు వాడరాదని అన్నారు.