దుబ్బాక మున్సిపాలిటీలోని కొన్ని వార్డుల్లో మురికి కాలువలు చెత్తాచెదారం ప్లాస్టిక్ కవర్లతో నిండి పూర్తిగా చెత్తాచెదారంతో నిండిపోయాయి. దీంతో దుర్వాసన వెదజల్లడంతో దోమల బెడద ఎక్కువై విష జ్వరాలు, మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నారు. కాలనీల్లో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.