న్యాయం కావాలి.. మహిళ రైతు ఆవేదన

80చూసినవారు
పోలీస్ అధికారితో తనకు ప్రాణభయం ఉందని ఓ మహిళ రైతు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన ఈరబోయిన భాగ్య అనే మహిళ రైతు, అదే గ్రామానికి చెందిన దమ్ముగారి వెంకట్ రెడ్డి అనే పోలీస్ అధికారిపై ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ అకారణంగా తనను దూషించిన పోలీస్ అధికారి వెంకటరెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరింది.

సంబంధిత పోస్ట్