పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో కనువిప్పు

70చూసినవారు
దుబ్బాక మండలం రాజక్క పేట గ్రామంలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఎస్సై గంగరాజు ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందం సైబర్ నేరాలు, గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరం జరిగితే 1930 కాల్ చేయాలని సూచించారు. గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్