హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి బోనాల పండుగలో బీసీ రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. డప్పు చప్పుళ్ల నడుమ భోనంతో ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. బోనాల పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అమ్మ దయతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.