ఆరోగ్యమే మహాభాగ్యమని డిపిఎం రాజయ్య, ఏపీఎం డాకయ్య అన్నారు. బుధవారం మిరుదొడ్డి, అక్బర్ పేట భూంపల్లి మండలంలో జిల్లా కలెక్టర్, డిఆర్డిఓ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సమక్షంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా వంటివి ప్రతి ఒక్కరు చేయాలని సూచించారు. యోగా చేయడం వలన షుగర్, బీపీ తో పాటు రోగాలకు అడ్డుకట్ట వేయడం జరుగుతుందన్నారు.