దుబ్బాకలో శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ దేవాలయంలో గురువారం మూడో వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గన్నే వనిత భూమిరెడ్డి, మాజీ ఎంపీపీ కొత్త పుష్పలత, కిషన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.