గజ్వేల్: అధికారులు, సిబ్బంది సమిష్టిగా సమన్వయంతో విధులు నిర్వహించాలి

65చూసినవారు
గజ్వేల్: అధికారులు, సిబ్బంది సమిష్టిగా సమన్వయంతో విధులు నిర్వహించాలి
అధికారులు, సిబ్బంది సమిష్టిగా సమన్వయంతో విధులు నిర్వహించాలని గజ్వేల్ ఏసిపి కె. నరసింహులు అన్నారు. సోమవారం సిద్ధిపేట జిల్లా రాయపోల్, దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలు మరియు వివిధ నేరాలలో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఫిర్యాదిదారులతో మర్యాదగా మాట్లాడాలని అన్నారు. వారంలో రెండు, మూడు సార్లు గ్రామాలను సందర్శించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్