రంగనాయక సాగర్ లోకి నీటి పంపింగ్ తరవాత మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సందర్శించారు. జలదృశ్యాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. రైతులకు నీరు అందించాలనే నిత్య తపనకు నిదర్శనమని అన్నారు. సిద్దిపేట నియోజకవర్గ రైతాంగానికి గొప్ప వరం రంగనాయక సాగర్ అని అన్నారు. ప్రస్తుతం 2. 3 టీఎంసీలు ఉందని, 3 టీఎంసీల వరకు నీటిని నింపాలని అధికారులను కోరారు.