ప్రజలకు ఇబ్బంది కలగకుండా మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేయాలని బీజేపీ మండల పార్టీ ఉపాధ్యక్షులు మంగలి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో రేషన్ దుకాణాలను వారు సందర్శించి ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను, అలాగే బియ్యం ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా రేషన్ బియ్యం పంపిణీ చేపట్టాలని డీలర్లకు సూచించారు.