పొద్దు తిరుగుడు పంటను దళారులకు విక్రయించి నష్టపోవద్దని పీఏసీఎస్ చైర్మన్ హరికృష్ణారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా తొగుటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. మార్కెట్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు.