ఉద్యమ సారథి కేసీఆర్ స్ఫూర్తితో రేపు సిద్దిపేటలో నిర్వహించే: దీక్షా దివస్' లో దుబ్బాక నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ దుబ్బాక పట్టణ అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ గౌడ్ కోరారు. ఆయన గురువారం దుబ్బాకలో మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగే'ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొంటారన్నారు.