సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని వీరరెడ్డిపల్లిలో స్వయం పాలన దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు విద్యా బోధనలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మండల విద్యాధికారి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చిన్న పని నుండే జీవిత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోని వాటిని సాధించే దిశగా చదవాలన్నారు.