ఉమ్మడి మెదక్ రీజియన్ బస్టాండ్ అన్నింటిలోనూ సిద్దిపేట డిపో మోడ్రన్ బస్టాండ్ ఉత్తమ బస్టాండ్ గా ఎంపికైందని డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఉత్తమ బస్టాండ్ అవార్డుకు గాను రూ. 5 వేల నగదును డిపో మేనేజర్ వై. సుఖేందర్ రెడ్డికి మంగళవారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం నాయక్ అందజేశారు. రూ. 5 వేల నగదును కార్మికుల సంక్షేమ కోసం ఉపయోగిస్తామని డిపో మేనేజర్ తెలిపారు.