సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట 7వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌటి ఎల్లయ్య ఇటీవలే అనారోగ్యంతో మరణించడంతో, వారి కుటుంబాన్ని, అలాగే 9వ వార్డు పట్టణ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు గట్టు శ్రీకాంత్ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు గాయాలైన విషయం తెలుసుకొని శుక్రవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు.