ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని రైతులు దళారులకు విక్రయించి నష్టపోవద్దని పీఏసీఎస్ చైర్మన్ హరికృష్ణారెడ్డి సూచించారు. సిద్ధిపేట జిల్లా తోగుట మండలంలోని వరదరాజుపల్లి, గోవర్ధనగిరి, కాన్గల్, లింగంపేట, రాంపూర్, చందాపూర్, వెంకట్రావుపేట, జప్తిలింగారెడ్డిపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించారు. అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని, దళారులకు విక్రయించవద్దని కోరారు.