సిద్ధిపేట జిల్లా తొగుట మండలంలోని లింగాపూర్ పీడర్ లైన్ కింద చెట్ల కొమ్మలు తొలగించనున్నందున విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్టు ఏఈ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. నేడు గురువారం ఉదయం 7. 30 గంటల నుంచి 10. 30 గంటల వరకు రాంపూర్, చందాపూర్, వెంకట్రావుపేట, లింగాపూర్, బంజేరుపల్లి గ్రామాలకు గృహ, వ్యవసాయ మోటర్లకు విద్యుత్ ను నిలిపివేయనున్నట్లు తెలిపారు.