అక్బరుపేట భూంపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో ని చార్వాక మోడల్ పాఠశాలలో శుక్రవారం ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కుమార్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పాఠశాలలో పిల్లలందరూ సాంప్రదాయ వస్త్రాలను ధరించి రంగవల్లులు వేశారు. భోగి మంటలు వేసి, గాలిపటాలు ఎగురవేశారు. పిల్లలందరూ పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణాన్ని కనపరిచారన్నారు.