సిద్ధిపేట: నిరుద్యోగులకు అండగా నిలుస్తూ.. ప్రభుత్వంతో పోరాడుతా

50చూసినవారు
సిద్ధిపేట: నిరుద్యోగులకు అండగా నిలుస్తూ.. ప్రభుత్వంతో పోరాడుతా
నిరుద్యోగులకు అండగా నిలుస్తూ.. వారి పక్షాన ప్రభుత్వంతో పోరాడుతానని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి సిద్ధిపేటకు చెందిన దేవునూరి రవీందర్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు ఉచితంగా న్యాయ సేవలు అందించానన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా కృషిచేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్