మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యమని ఇన్ ఛార్జ్ ఏపీఎం పంగ లింగం పేర్కొన్నారు. నంగనూరు మండల సమైక్య కార్యాలయంలో పశు వైద్యాధికారి రామ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి లతో కలిసి మహిళా శక్తి కార్యక్రమంలో మహిళా పాడి రైతులకు శిక్షణ నిర్వహించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మహిళా శక్తి కార్యక్రమం చేపట్టిందన్నారు.